
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళనలు మరింత ఉదృతం అయ్యాయి. వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి ఉద్యమంలో భాగంగా గుంటూరులో బుధవారం భారీ ప్రదర్శన చేపట్టారు. నగర పార్టీ అధ్యక్షురాలు నూరీ ఫాతిమా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రదర్శన అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరీ ఫాతిమా మీడియాతో మాట్లాడారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఆరంభం అయిందని, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు.







