
విజయవాడ: నవంబర్ 12:-డాక్టర్ ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Dr. NTR UHS), విజయవాడ ఆధ్వర్యంలో 2025-26 విద్యాసంవత్సరానికి చెందిన ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సుల మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం “స్ట్రే వెకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్”కి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు 2025 నవంబర్ 12న మధ్యాహ్నం 3.00 గంటల నుంచి నవంబర్ 13న సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. దరఖాస్తులు https://drntr.uhsap.in లేదా https://apuhs-ugadmissions.aptonline.in/MBBSMQ/Home/StudentLogin వెబ్సైట్ల ద్వారా సమర్పించాలి.దరఖాస్తు ఫీజు రూ.9,000 (జీఎస్టీ తప్ప). ఫీజు ఒకసారి చెల్లించిన తరువాత తిరిగి చెల్లించబడదు లేదా భవిష్యత్తుకు సర్దుబాటు చేయబడదు అని యూనివర్సిటీ స్పష్టం చేసింది.
తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసిన పత్రాలు:
- NEET UG 2025 ర్యాంక్ కార్డ్
- పుట్టినతేదీ ధృవపత్రం (SSC మార్క్ మెమో)
- ఇంటర్మీడియట్ మార్క్ మెమో / ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్
- ఆధార్ కార్డు (ఫోటో ఐడీ ప్రూఫ్‌గా)
- కుల ధృవపత్రం (అవసరమైతే)
- మైనారిటీ సర్టిఫికేట్ (ముస్లిం అభ్యర్థులకు)
- PWD సర్టిఫికేట్ (అవసరమైతే)
- తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, అభ్యర్థి సంతకం
ఎన్.ఆర్.ఐ. సీట్లకు సంబంధించి పాస్‌పోర్ట్, గ్రీన్‌కార్డ్/సిటిజన్‌షిప్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్, బిల్లులు వంటి ఆధార పత్రాలు సమర్పించాలి. కస్టోడియన్ సర్టిఫికేట్లు ఆమోదించబడవు.ప్రత్యేక సూచనలు:డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.అసంపూర్ణంగా ఉన్న దరఖాస్తులు లేదా తప్పనిసరి పత్రాలు అప్లోడ్ చేయని వారు మెరిట్ లిస్ట్‌లో పరిగణించబడరు.తప్పుడు సమాచారం లేదా నకిలీ సర్టిఫికేట్లు సమర్పించినట్లు తేలితే సీటు రద్దు చేయబడుతుంది.యూనివర్సిటీ హెచ్చరిక:
“కౌన్సెలింగ్ ప్రక్రియలో ఎటువంటి మధ్యవర్తులు, బ్రోకర్లు లేదా దళారులను నమ్మరాదు. సీట్లు కేవలం నియమావళి ప్రకారం NEET ర్యాంకు మరియు అభ్యర్థుల ఎంపికల ఆధారంగా మాత్రమే కేటాయించబడతాయి,” అని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా. వి. రాధికా రెడ్డి స్పష్టం చేశారు.సహాయ సంఖ్యలు:వివరాలకు సంప్రదించవచ్చును – 8978780501, 7997710168, 9000780707 (ఉ. 10 నుంచి సా. 6 గంటల వరకు).







