chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Sainik Welfare:సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి-తాండ్ర సాంబశివరావు

బాపట్ల రూరల్: నవంబర్ 12:-వికలాంగులైన మాజీ సైనికుల పిల్లలకు రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందిస్తున్న ఆర్థిక సహాయ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు పిలుపునిచ్చారు.బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పాత నందాయపాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు చీరాల నాగేంద్రరెడ్డి కుమారుడు శశికిరణ్ రెడ్డి 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతూ ఇంటికే పరిమితమై ఉన్న విషయం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావుకు తెలిసిన వెంటనే, ఆయన గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి శ్రీమతి గుణశీలాకు సమాచారం అందించారు.వెంటనే స్పందించిన శ్రీమతి గుణశీలా ఈరోజు తన సిబ్బందితో కలిసి పాత నందాయపాలెం గ్రామానికి వెళ్లి పత్రాలను పరిశీలించారు. అనంతరం శశికిరణ్ రెడ్డికి ప్రతి నెల రూ.2,500/- ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు సైనిక్ వెల్ఫేర్ అధికారిణి గుణశీలాకు ధన్యవాదాలు తెలియజేశారు. 50 శాతం పైబడి అంగవైకల్యం ఉన్న మాజీ సైనికుల పిల్లలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని, అర్హులైన మాజీ సైనికులు సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయాన్ని తప్పక వినియోగించుకోవాలని ఆయన సూచించారు.సైనిక్ వెల్ఫేర్ అధికారి గుణశీలా మాట్లాడుతూ, “అంగవైకల్యం కలిగిన మాజీ సైనికుల పిల్లల వివరాలు అందిన వెంటనే పరిశీలించి, అర్హులైన వారికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.కార్యక్రమంలో గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఆనందరావు, సుబ్రహ్మణ్యం, రాజేష్‌తో పాటు APRMSSS రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారు సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, సీనియర్ మాజీ సైనికులు డి. వెంకటేశ్వర్లు, ఎం.కె. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker