chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విశాఖపట్నం జిల్లా

Visakha lo IT:విశాఖలో ఐటీ హడావిడి… భూమిపూజలకు సిద్దమైన లోకేష్

విశాఖపట్నం:12-11-25:- నగరంలో ఐటీ రంగం మరోసారి కదలికలోకి వచ్చింది. పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌-2025కు ముందే టెక్ కంపెనీల జాతర నెలకొననుంది. రేపు (13వ తేదీ) రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ నాలుగు ఐటీ కంపెనీల భూమిపూజతో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు

Visakha lo IT:విశాఖలో ఐటీ హడావిడి… భూమిపూజలకు సిద్దమైన లోకేష్

రహేజా గ్రూప్‌ ఆధ్వర్యంలో ఐటీ స్పేస్‌, రెసిడెన్షియల్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్‌, అలాగే విశాఖలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ప్రారంభమవడంతో వేలాది ఉద్యోగావకాశాలు సృష్టికానున్నాయి.ఇదే సమయంలో టిసిఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి ప్రముఖ సంస్థలు విశాఖలో తమ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు దశల వారీగా ముందుకు సాగుతున్నాయి. టిసిఎస్‌ ద్వారా 12 వేలమంది యువతకు, కాగ్నిజెంట్‌ ద్వారా మరో 8 వేలమందికి ఉద్యోగాలు లభించనున్నాయి.మంత్రి లోకేష్‌ సదుపాయాల అభివృద్ధికి తీసుకున్న చొరవతో విశాఖపై జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు చూపిస్తున్న ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఇప్పటికే గూగుల్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఎఐ హబ్‌ను అమెరికా వెలుపల విశాఖలో రూ.1.35 లక్షల కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌-2025కు ముందు విశాఖలో ఐటీ పెట్టుబడుల ఈ వర్షం… ఆంధ్రప్రదేశ్‌ టెక్‌ రంగానికి కొత్త దిశ చూపనుంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker