chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలు

Parliamentary sthayee sangam:పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలోమోంథా తుఫాను నష్టంపై వివరణ

న్యూఢిల్లీ: నవంబర్ 12:-కేంద్ర హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో లోక్‌సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల ఎంపీ శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన ‘మోంథా’ తుఫాను కారణంగా రాష్ట్రం ఎదుర్కొన్న తీవ్ర నష్టాన్ని ఆయన కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు.తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రహదారులు ధ్వంసమయ్యాయని, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఎంపీ వివరించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కమిటీ ముందు ఉంచారు.

రాష్ట్రం తుఫాను ప్రభావం నుంచి త్వరగా కోలుకోవడానికి రూ. 5,265 కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని కేంద్రం నుంచి విడుదల చేయాలని తెన్నేటి కృష్ణ ప్రసాద్ కోరారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.”ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో మోంథా తుఫాను విపరీత నష్టం చేసింది. ప్రజల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం గమనించి, తక్షణ నిధులు మంజూరు చేయాలి,” అని ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కమిటీ ముందు విజ్ఞప్తి చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker