chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍గుంటూరు జిల్లా

GMC గుంటూరు నగర పాలక సంస్త స్టాండింగ్ కమిటీ ఎన్నిక ? నేరుగా హైదరాబాద్ పార్టీ శిబిరాలు నుండి కౌన్సిల్ హాల్ కి కార్పొరేటర్లు

  • మేయర్ , డిప్యూటీ మేయర్ , కమిషనర్ వివాదంతో ప్రారభించిన కౌన్సిల్ రగడకు రేపు తెరపడనుందా ఇందులో విజయం ఎవరిదీ .
  • గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎవరిదీ విజయం ? హైదరాబాద్ కార్పొరేటర్ల శిబిరాలు ? రేపు నేరుగా హైదరాబాద్ నుండి గుంటూరు నగరపాలకసంస్థ కౌన్సిల్ కార్యాలయానికి చేరుకోనున్నారు . ఇక్కడ జరిగే రహస్య ఓటింగ్ లో తమ ఓటును వినియోగించుకోనున్నారు .
  • కార్పొరేటర్ల మొత్తం : 57
  • కాళీ ఏర్పడిన కార్పొరేటర్లు – 1
  • మొత్తం : 56
  • వైస్సార్సీపీ మొత్తం : 33
  • టీడీపీ : 23
  • ప్రస్తుతం శిబిరాల్లో వైస్సార్సీపీ కి 27 మంది మద్దతు ఉండగా
  • టీడీపీ కి 29 మంది ని తమ శిబిరం లో వున్నారని . స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి దే విజయం అని భావిస్తున్నారు
  • 29 మంది మేజిక్ ఫిగర్ ను కూటమి కార్పొరేటర్లతో విజయ సాదిస్తామని ధీమాగా ఉన్నట్లు టీడీపీ ధీమాతో వుంది .
  • పోలింగ్ సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాన్నం 3 గంటలకు వరకు
  • ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతతో పోలీస్ బందో బస్తు ఏర్పాటు

ఫిబ్రవరి 3 వతేది గుంటూరు నగరపాలక సంస్థా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగనున్నాయి . ప్రస్తుతం వైస్సార్సీపీ పార్టీ చైర్మన్ గా కొనసాగటం, కౌన్సిల్ మెజారిటీ సభ్యలు వైస్సార్సీపీ వారు వుండటం , ప్రస్తుతం టీడీపీ రాష్ట్రంలో అధికారం లోకి రావటం, వైస్సార్సీపీ నుండి కార్పొరేటర్లు ను టీడీపీ లోకి దూకటంతో సోమవారం జరిగే రహస్య వాటింగ్ లో అధికార పార్టీ ఎంత వరకు ప్రభావిత చేయగలిగింది .

అలాగే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన వైస్సార్సీపీ నాయుకులు తమ కార్పొరేటర్లు ను కాపాడుకొని,పట్టు పట్టు నిలుపుకొంటారా ? లేదా అనేది రేపు తేలనుంది.

మున్సిపల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ విధులు మరియు ఎంపిక విధానం

స్టాండింగ్ కమిటీ అంటే ఏమిటి?

మున్సిపల్ కౌన్సిల్‌లో స్టాండింగ్ కమిటీ ఒక ముఖ్యమైన కార్యనిర్వాహక కమిటీగా పనిచేస్తుంది. ఇది మున్సిపల్ పరిపాలనలో కీలకమైన అభివృద్ధి, ఆర్థిక వ్యయాలు, పట్టణ ప్రణాళికలు, మరియు ఇతర పాలనాపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది.

స్టాండింగ్ కమిటీని ఎవరు ఎన్నుకుంటారు?

  • స్టాండింగ్ కమిటీ సభ్యులను మున్సిపల్ కౌన్సిల్ సభ్యులే తమలో నుండి ఎన్నుకుంటారు.
  • స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు (Chairman) కూడా కమిటీ సభ్యుల మధ్య నుండే ఎన్నుకోబడతారు.
  • కమిటీ సభ్యుల సంఖ్య మున్సిపాలిటీ పరిమాణాన్ని అనుసరించి మారవచ్చు.

స్టాండింగ్ కమిటీ విధులు

  1. ఆర్థిక నిర్వహణ: మున్సిపాలిటీలో ఆదాయ వ్యయాలను పరిశీలించడం, బడ్జెట్ తయారు చేయడం, ఖర్చులను అంగీకరించడం.
  2. పట్టణాభివృద్ధి: రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పథకాలు మొదలైన అభివృద్ధి పనులను పర్యవేక్షించడం.
  3. ప్రశాసన పర్యవేక్షణ: మున్సిపల్ ఉద్యోగుల నియామకం, పదోన్నతులు, శాస్తులు మొదలైనవాటిని పర్యవేక్షించడం.
  4. నియమాలు మరియు విధానాలు: మున్సిపల్ పరిపాలనకు అవసరమైన కొత్త నిబంధనలు రూపొందించడం, అమలు చేయడం.
  5. కాంట్రాక్టులు మరియు టెండర్లు: మున్సిపల్ పనులకు సంబంధించిన ఒప్పందాలు, టెండర్లు పరిశీలించి ఆమోదించడం.
  6. సాధారణ సమస్యలు పరిష్కారం: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం.

ముఖ్యమైన విషయం:

స్టాండింగ్ కమిటీ మున్సిపల్ కౌన్సిల్‌కు జవాబుదారిగా ఉంటుంది. మున్సిపల్ పాలనలో ఆర్థిక మరియు పరిపాలనా అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఈ కమిటీ కలిగి ఉంటుంది.

మున్సిపల్ పాలనలో స్టాండింగ్ కమిటీ ప్రాముఖ్యత:

  • మున్సిపాలిటీని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.
  • నిధులను సమర్థంగా వినియోగించడానికి పర్యవేక్షణ చేస్తుంది.
  • అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది.
GMC గుంటూరు నగర పాలక సంస్త స్టాండింగ్ కమిటీ ఎన్నిక ? నేరుగా హైదరాబాద్ పార్టీ శిబిరాలు నుండి కౌన్సిల్ హాల్ కి కార్పొరేటర్లు

సోమవారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పక్కాగా, సజావుగా నిర్వహించాలని, ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు మరియు సిబ్బంది ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం ఉదయం కమిషనర్ ఎన్నికల అధికారి మరియు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు మరియు ఇతర అధికారులతో కలిసి సోమవారం నిర్వహించనున్న స్టాండింగ్ కమిటి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
తొలుత ఎన్నికల నిర్వహణకు సంబంధించి సూచిక బోర్డులు, పోలింగ్ కేంద్రం నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కంపార్ట్ మెంట్, బ్యాలెట్ బాక్స్, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.

Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)
Product
pTron Newly Launched Fusion Hook v2 6W Bluetooth Speaker with 8 Hrs Playtime, 2.04" Neo Driver for Pristine Sound, Mini Size Portable Speaker, BTv5.1 Connectivity, TWS Feature & Type C Charging(Black)
Product
Bombay Shaving Company 11 In 1 Trimmer Men|All In One Full Body Trimmer|90 Min Charge Time|90 Mins Run Time|Hair, Ear, Beard, Body, Nose Trimme|Type C Charging|Power Groomer (New Model),Blue
Product
Lymio T Shirt for Men || Chain Collar Style T Shirt || Solid Style (Packs Also Available) (T-61-63)

పోలింగ్ సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాన్నం 3 గంటలకు ముగుస్తుందన్నారు. ఓటు వేయుటకు వచ్చే కార్పొరేటర్లుకు మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని, లోపలకు వచ్చు సమయంలో నగర పాలక సంస్థ జారీ చేసిన ఐడెంటి కార్డులు విధిగా కలిగి ఉండాలని, ఫోన్లు, ఎలక్ట్రికల్ సంబంధిత వస్తువులు మరియు ఏ ఇతర సామగ్రిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడదన్నారు. కార్పోరేటర్ల ఇతర వస్తువులు భద్రపరచుటకు నగర పాలక సంస్థ పార్కింగ్ నందలి పౌరసేవా కేంద్రం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లోక్ రూమ్ నందు బద్రపరచుకోవాలన్నారు. పోలింగ్ సందర్భంగా నగర పాలక సంస్థ కార్యాలయంలోకి ఇతర వాహనాలు పార్కింగ్ నిషేధించాదమైనదని, ఓటింగ్ కొరకు కార్యాలయానికి వచ్చే కార్పొరేటర్ల వాహనాలను గాంధి పార్క్ పార్కింగ్ నందు పార్కింగ్ చేయాలన్నారు. ఓటు వేయుటకు వచ్చు కార్పొరేటర్లు నగర పాలక సంస్థ ప్రధాన ద్వారం నుండి ప్రవేశించి పోలీస్ తనిఖీ అనంతరం పోలింగ్ కేంద్రంలో వారి ఓటు వినియోగించుకొని, నగర పాలక సంస్థ పార్కింగ్ ద్వారం నుండి బయటకు వెళ్ళేలా ఏర్పాట్లు చేశామన్నారు. నగర పాలక సంస్థ ఉద్యోగులు విధిగా నగర పాలక సంస్థ గుర్తింపు కార్డుతో, వారికి కేటాయించిన విభాగాల్లోనే విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారలు సిబ్బంది ఉదయం 8 గంటలకల్లా గుర్తింపు కార్డుతో విధులకు హాజరుకావాలని, ఎన్నికల అధికారి తప్ప ఇతర ఎన్నికల సిబ్బంది ఫోన్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబడదన్నారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశ ద్వారానికి, బయటకు వెళ్ళు ద్వారాలకు ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతతో పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశామన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker