
కొత్తపేట మల్లయ్య లింగం భవన్ లో సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువత, రైతులు, విద్యారంగానికి చేసిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కావడం లేదన్నారు. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పినా రెండు సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం పేదలపై తెరచాప ద్రోహమని అన్నారు. అదేవిధంగా సిపిఐ శతాబ్ది మహాసభ ఖమ్మం నుంచి రాష్ట్ర రాజకీయాలకు, ప్రజాసమస్యల పరిష్కారానికి కొత్త దిశానిర్దేశం ఇవ్వనున్నదని ఈశ్వరయ్య తెలిపారు.







