chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News:మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి పటిష్ట కార్యాచరణ-జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

గుంటూరు: నవంబర్ 21:-జిల్లాలో మత్స్య సంపదను పెంపొందిస్తూ, మత్స్యకారుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు.ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తాడేపల్లి మండలం పడల రేవు వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ప్రకాశం బ్యారేజ్ జలాశయంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా, తెనాలి సబ్‌ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి 23,50,000 చేప పిల్లలను నీటిలో విడుదల చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 2047 స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్లో వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధకంతో పాటు మత్స్యరంగానికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. విత్తనం నుండి మార్కెటింగ్ వరకు మత్స్యకారుల అభివృద్ధికి అవసరమైన సహాయాలను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.

Guntur Local News:మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి పటిష్ట కార్యాచరణ-జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

జిల్లాలో పెద్దఎత్తున ఇన్‌ల్యాండ్ మత్స్యకారులు ఉన్నారని, ప్రకాశం బ్యారేజ్‌తో పాటు నాలుగు మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో మత్స్య సంపదను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలోని 202 గ్రామాల చెరువుల్లో కూడా చేపల సంపద పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు.ప్రస్తుత కాలంలో ప్రజల ఆహార పద్ధతుల్లో మార్పు వచ్చి ప్రోటీన్‌తో నిండిన ఆహారానికి డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ఫిషరీస్, ఆక్వా ఉత్పత్తులకు మరింత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులు సాగుచేసే దిశగా మత్స్యకారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Guntur Local News:మత్స్యకారుల సమగ్ర అభివృద్ధికి పటిష్ట కార్యాచరణ-జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

మత్స్యకారులందరూ AP-SADAలో తప్పనిసరిగా నమోదు కావాలని, ప్రధాని మత్స్య సంపద యోజన పథకం ద్వారా మార్కెటింగ్ సౌకర్యాల కోసం ఫిష్ వెండింగ్ యూనిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. లక్ష్యాల మేరకు గ్రౌండింగ్ వేగవంతం చేయాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా జిల్లాలోని ఆరు మత్స్యకారుల సహకార సంఘాలకు రూ. 10,11,978 విలువైన నూరుశాతం రాయితీ చెక్కులు కలెక్టర్, సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి అందజేశారు.గుంటూరు వెన్‌లాక్ మార్కెట్‌లో చేపలు విక్రయిస్తున్న మహిళా మత్స్యకారులు కనీస సౌకర్యాల లేమిపై కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి కిరణ్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు భూశంకర్, ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరి, ఎంపీటీసీ శివకుమారి, ఎంపీపీ కృష్ణ, తహసిల్దారు సీతారామయ్య సహా పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.


Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker