chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur local news:అంగన్ వాడీ కేంద్రాల్ని సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ

Guntur:తాడేపల్లి:నవంబర్ 21:-అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లి మండలంలోని పెనుమాకలో 3, 7 అంగన్‌వాడీ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.కేంద్రాల పరిధిలో 6 ఏళ్ల లోపు తక్కువ బరువున్న పిల్లలకు పౌష్టికాహారం అందించే చర్యలు తీసుకోవాలని సీడీపీఓకు ఆమె సూచించారు. సిబ్బంది, పిల్లలు, వారి తల్లులతో మాట్లాడిన ఆమె, కేంద్రాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Guntur local news:అంగన్ వాడీ కేంద్రాల్ని సందర్శించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ

చిన్నారుల బరువు–ఎత్తు పరిశీలనను క్రమం తప్పకుండా నిర్వహించాలని, తక్కువ బరువున్న పిల్లలను ఎన్ఆర్సీ కేంద్రాల్లో 15 రోజుల పాటు ఉంచి పౌష్టికాహారం అందించాలని ఆమె ఆదేశించారు. స్కూలుకు వెళ్లే పిల్లలకు హెచ్‌బీ పరీక్షలు చేయించి రక్తహీనత ఉంటే ఐరన్ సప్లిమెంట్లు ఇవ్వాలని సూచించారు. ఏఎన్‌ఎంలతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కూడా చెప్పారు.స్కూల్ డ్రాపౌట్లను గుర్తించి, వారి తల్లిదండ్రులతో చర్చించి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటింటి సందర్శనల్లో తల్లిబిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పించి, పౌష్టికాహారం, మందులు తీసుకునేలా చూడాలని ఆమె సూచించారు. కేంద్రాల్లో పౌష్టికాహారం అందించే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన ఆమె, పిల్లలతో మమేకమై ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నారు.పిల్లల రిజిస్టర్ నమోదు, హాజరు వివరాలను తనిఖీ చేసిన డాక్టర్ శైలజ, టాయిలెట్స్‌ను శానిటైజ్ చేయడం, ప్రీ గార్డెన్ అభివృద్ధి చేయడం వంటి సూచనలు సిబ్బందికి అందించారు.ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ అడ్వైజర్ రావూరి సూయజ్, సెక్షన్ ఆఫీసర్ శైలజ, మంగళగిరి సీడీపీఓ సరిత, ఏసీడీపీఓ సౌమ్య, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker