
హైదరాబాద్ :22-11-25:-సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’ పేరిట హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం భాగంగా బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి విద్యార్థులకు సైబర్ క్రైమ్స్‌పై అవగాహన కల్పించారు.
అరోరా కాలేజ్ డిగ్రీ, పీజీ విద్యార్థులతో మాట్లాడిన డీసీపీ… ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాల తీరును వివరించారు. స్కామర్లు ఎలా అత్యాశను, భయాన్ని ఉపయోగించుకుని ప్రజలను మోసగిస్తున్నారో ఉదాహరణలు చెబుతూ నేరగాళ్ల వ్యూహాలపై విద్యార్థులను అప్రమత్తం చేశారు.ప్రతి వారం మంగళ, శనివారాల్లో పోలీసులు ఇంటింటికీ వెళ్లి సైబర్ మోసాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్టు తెలిపారు. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సజాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చిన డీసీపీ శిల్పవల్లి… ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సైబర్ క్రైమ్ నివారణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.







