

చీరాల నియోజకవర్గ స్థాయిలో నయి చేతన్ 4.0 మార్పు కోసం ముందడుగు కార్యక్రమం చీరాల నియోజకవర్గస్థాయిలో జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమం గురించి గౌరవనీయులు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య మరియు AMC చైర్మన్ కౌత్రపు జనార్ధన్ రావు చీరాల మరియు వేటపాలెం మండల సమైక్య సభ్యులకు పోస్టర్ ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రతి ఒక్క మహిళలకు నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 వరకు జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా ప్రచారం చేసి అందరికీ అవగాహన కల్పించాలని చెప్పటం జరిగింది. సమాజంలో స్త్రీ మరియు పురుషులు సమానత్వానికి జండర్ ఈక్వాలిటీ పాటించాలని తెలియజేసినారు. పురుషులతో పాటు స్త్రీలు కూడా అన్ని రంగాలలో ముందు ఉండటం జరిగింది చట్టసభలో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది మరియు శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా స్త్రీలు ముందు ఉండడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ జి స్నేహ చీరాల బార్ అడ్వకేట్ గారు, చీరాల మండలం కడెం మధుసూదన్ రావు APM గారు, వేటపాలెం మండలం కే అంజిబాబు APM గారు మరియు సిసి బుజ్జి, కవిత, వేణు మరియు వివోఏలు ఈ కార్యక్రమానికి హాజరైనారు








