

జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు.
జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షలు ఈనెల 7వ తేదీన ఆదివారము జరుగుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ పరీక్ష ఉదయము10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరగనున్నాయని ఆయన తెలిపారు.ఈ పరీక్షలకు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని, పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలు అందజేస్తారని ఆయన తెలిపారు.జిల్లాలో బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజన్ల పరిధిలో 11 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. 2,412 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుగుతున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, చీఫ్ సూపరింటెండెంట్లను, రూట్ అధికారులను మరియు కస్టోడియళ్లను నియమించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ప్రాథమిక వైద్యం అందించడానికి ప్రతి పరీక్షా కేంద్రంలో ఏఎన్ఎం లను నియమించామన్నారు. పరీక్షలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బస్సులు నడపాలని, విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసి వేయించాలన్నారు. పోలీసుల బందోబస్తు నిర్వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి శానిటేషన్ చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.పరీక్షలు సమర్థంగా నిర్వహించడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ పరీక్షలకు సంబంధించి బాపట్ల జిల్లా లోని పరీక్ష కేంద్రాల వివరాల పట్టిక ఈ క్రింద జత పరచడమైనది.







