
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ విద్యా, వైద్యం, PM సూర్యాఘర్, ఇతర పథకాల పై గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, DMHO విజయలక్ష్మీ, GMCకమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం దినకర్ మాట్లాడుతూ విద్య, వైద్యం విషయంలో గుంటూరు ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్ర-వికసిత్ భారత్ కోసం మరింతగా కష్టపడాల్సి ఉందని చెప్పారు. NTR వైద్య సేవ ద్వారా ప్రతిరోజూ 3 లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో మానవవనరులు పుష్కలంగా ఉన్నాయని, ఇది స్వర్ణాంధ్ర కు బాటలు వేయాలని ఆకాంక్షించారు. C.M చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగాప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు.







