
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదాలు మరియు గదుల బుకింగ్ పూర్తిగా ఆన్‌లైన్ విధానానికి మార్చుతున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ తెలిపారు. డిసెంబర్ 7, 2025 నుంచి ప్రతి భక్తుడూ దర్శనం మరియు సేవా టికెట్లు ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని, టికెట్ ప్రింట్‌తో రావడం తప్పనిసరం అని ఆయన స్పష్టం చేశారు. KanakaDurga కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి
భక్తులు దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ www.kanakadurgamma.org, ప్రభుత్వ పోర్టల్ aptemples.ap.gov.in, అలాగే మనమిత్ర WhatsApp నెంబర్ 95523 00009 ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనం, ప్రసాదాల సౌకర్యం అందిస్తామని కార్యనిర్వహణాధికారి చెప్పారు.
భక్తులందరూ ఈ డిజిటల్ సేవలను వినియోగించుకుని ఆలయంలో ఏర్పాటుచేసిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం సూచించింది.








