
Bapatla:పర్చూరు :04-12-25:-పర్చూరు నియోజకవర్గం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేస్తున్న కృషికి ప్రభుత్వం మద్దతు లభించింది. ఆయన ప్రత్యేక సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు పురాతన దేవాలయాల పునర్నిర్మాణానికి సిజిఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) ద్వారా మొత్తం రూ.8.40 కోట్లు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిధులతో నియోజకవర్గంలోని పలు ఆలయాలు పునర్వైభవాన్ని సంతరించుకోనున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి :పర్చూరు వేణుగోపాలస్వామి ఆలయం – రూ. 1.75 కోట్లుభీమేశ్వరాలయం – రూ. 1.50 కోట్లుదేవరపల్లి వేణుగోపాలస్వామి ఆలయం – రూ. 1.00 కోట్లుగర్నెపూడి విగ్నేశ్వర, విశ్వేశ్వర ఆలయాలు – రూ. 1.00 కోట్లుఅనంతవరం వేణుగోపాలస్వామి ఆలయం – రూ. 1.05 కోట్లుసురవరపుపల్లి చెన్నకేశవ దేవాలయం – రూ. 1.05 కోట్లుసంతరావూరు శ్రీరామలింగేశ్వర ఆలయం – రూ. 1.05 కోట్లు
ఈ నిధులకు అదనంగా 33% మ్యాచింగ్ గ్రాంట్ తో ఆలయాల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు.పర్చూరు నియోజకవర్గంలో ఎన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పురాతన దేవాలయాలు తిరిగి పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తుండటంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి శ్రమిస్తున్న ఎమ్మెల్యే ఏలూరికి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అలాగే ఈ నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డిలకు ఎమ్మెల్యే ఏలూరి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.







