
బాపట్ల:04-12-25:- పట్టణ నూతన మాస్టర్ ప్లాన్‌పై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో, అభ్యంతరాల స్వీకరణ గడువును 30 రోజులు పెంచాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రఘునాథ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
ప్రస్తుతం ఉన్న డ్రాఫ్ట్ ప్రజా అభిప్రాయాలను ప్రతిబింబించడంలేదని, గ్రామాలు–వార్డుల స్థాయిలో ప్రజలతో సమావేశాలు నిర్వహించిన తర్వాతే తుది మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్, పట్టణ ప్రణాళిక అధికారి నేతృత్వంలో సచివాలయాలలో గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించాలని చెప్పారు.ప్రజలకు పూర్తిస్థాయి అవకాశం ఇవ్వాలంటే అభ్యంతరాల గడువు పొడిగించడం అవసరమని అన్నం సతీష్ అధికారులు వివరించారు.







