
గుంటూరు:మంగళగిరి:04-12-25: 2024 నుంచి ఇప్పటి వరకు MSME–ST పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం విడుదల చేయాల్సిన సబ్సిడీలు నిలిచిపోయాయని, తనకు రావలసిన ₹45 లక్షలు ఇప్పటికీ అందలేదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.శ్రీశక్తి పథకం అమలు కారణంగా భారీ సంఖ్యలో ప్రజలు బస్సులు ఎక్కుతున్నారని, ఫలితంగా RTC బస్సుల టైర్లు పాడైపోతున్నాయి, డీజిల్ వ్యయం పెరుగుతోంది. అయితే తన పరిశ్రమకు ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులు నిలిపివేయడం వల్ల తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయని తెలిపింది.
కమిషనర్‌ను నేరుగా కలిసి సమస్యను వివరించేందుకు పిల్లలతో కలిసి మంగళగిరికి వచ్చానని, సబ్సిడీ డబ్బులు విడుదల చేసేవరకు APIIC కార్యాలయం వద్ద నుంచి వెళ్లబోమని కరీం సత్య స్పష్టం చేసింది.ఈ ఆందోళనతో APIIC కార్యాలయం వద్ద అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.







