chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur News: రహదారుల మరమ్మతులు చేపట్టాలి

GUNTUR COMMISSIONER VISIT

గుంటూరు నగరంలో రోడ్లకు ప్యాచ్ వర్క్ లు ఎప్పటికప్పుడు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ రాజాగారి తోట, పొన్నూరు రోడ్, బాలాజీ నగర్, కొరెటపాడు, నవభారత్ నగర్, వికాస్ నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను, తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధాన, అంతర్గత రహదారులకు వార్డ్ సచివాలయాల వారీగా ప్యాచ్ వర్క్ లను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చేపట్టాలని ఏఈలను ఆదేశించారు. బాలాజీ నగర్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలోని యానాది కాలనీలో నూతన డ్రైన్ నిర్మాణానికి అంచనాలు సిద్దం చేయాలన్నారు. అలాగే డ్రైన్లలో సిల్ట్ ని ఎప్పటికప్పుడు తొలగించాలని, చెత్త తరలింపుకు అవసరమైతే ప్రైవేట్ ట్రాక్టర్లు అద్దెకు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. గృహ కల్ప ప్రాంతంలో డ్రైన్ ఆక్రమణలను తక్షణం తొలగించాలని పట్టణ ప్రణాళిక కార్యదర్శులను ఆదేశించారు. కొరెటపాడు, వికాస్ నగర్ ప్రాంతాల్లో స్థానిక అవసరాల మేరకు డ్రైన్ల నిర్మాణంకు అంచనాలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, క్యాంటీన్ కి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం అందించేలా ఎప్పటికప్పుడు డిమాండ్ కి అనుగుణంగా ఇండెంట్ పెంచుకోవాలని సిబ్బందికి సూచించారు. పర్యటనలో డిఈఈ సతీష్ కుమార్, రమేష్ బాబు, ఏసిపి రెహ్మాన్, టిపిఎస్ లు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker