
పశ్చిమ నియోజకవర్గం ఏటి అగ్రహారం SKBMMC పాఠశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలోని ఎన్.సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…. రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 3.0 ద్వారా తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని పెంచి విద్యార్థుల విద్యా పురోగతిని సక్రమంగా పర్యవేక్షించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన చర్యలు ఎంతో ప్రశంసనీయమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. కొత్త పాఠ్యపుస్తకాలలో లింగ సమానతను ప్రతిబింబించే విధంగా చేసిన మార్పులు విద్యార్థుల్లో సరైన దృక్పథాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. స్కూల్ పై తల్లిదండ్రుల అభిప్రాయాలు అత్యంత విలువైనవని, పిల్లల పర్యవేక్షణ ఇంటి నుంచే ప్రారంభమవుతుందని, హోం వర్క్, క్రమశిక్షణ, మొబైల్ వినియోగం, ప్రవర్తన వంటి అంశాల్లో తల్లిదండ్రులు సరైన దృష్టి పెట్టాలని సూచించారు. 76% ఉత్తీర్ణత సాధించిన ఈ పాఠశాల 85–90% పైగా లక్ష్యంగా పెట్టుకొని ర్యాంకులు మరింత పెంచాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి, ప్రిన్సిపాల్స్, టీచర్స్, విద్యార్థులను కోరారు. కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీ పై గళ్ళా మాధవి ప్రత్యేకంగా స్పందిస్తూ విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, సివిక్ సెన్స్ పెంచేందుకు నారా లోకేష్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఈ స్కూల్ నుంచి కూడా భవిష్యత్‌లో ఎమ్మెల్యేలా ఎదిగే నాయకులు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉన్న తాగునీటి ప్యూరిఫయర్, టాయిలెట్స్, క్లాసులు, గ్రౌండ్ వంటి సమస్యలను త్వరలో పరిష్కరించి ఈ స్కూల్‌ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే గళ్ళా మాధవి భరోసా ఇచ్చారు. టెన్త్ క్లాస్ మరియు నైన్త్ క్లాస్‌లలో ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించిన ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలను జూన్ నెలలో ప్రత్యేక ట్రిప్‌కు తీసుకెళ్తామని ప్రకటించి విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపారు. చివరిగా తల్లిదండ్రులు పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచి, బాధ్యతతో పెంచాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు. ఈ కార్యక్రమంలో అడకా పద్మావతి, తుమ్మల నాగేశ్వరరావు, అడక శ్రీను, గొర్ల మల్లేశ్వరి, దాసరి వెంకటేశ్వరావు, ఖాజా వలి, పఠాన్ అస్మా తదితరులు పాల్గొన్నారు.







