
సికింద్రాబాద్ :బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్‌ను శుక్రవారం మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు జాజుల శ్రీనివాస్ పరామర్శించారు.సాయి ఈశ్వర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుండి అడిగి తెలుసుకున్న అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…
“తెలంగాణలో సగం జనాభా బీసీలే. వారికి అన్యాయం చేస్తే ఏ ప్రభుత్వం అయినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. బీసీల ఓట్లతో గెలిచిన నేతలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం అసహనం కలిగిస్తోంది. యువకులు మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడకూడదు. బీసీల బిక్షతోనే ప్రభుత్వాలు నిలబడతాయి… ఈ నిజం మరిచిపోవద్దు. బీసీలంతా ఐక్యంగా పోరాడితే ఏ ప్రభుత్వం అయినా మెడలు వంచక తప్పదు,” అని హెచ్చరించారు.మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…
బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమాలు ఉధృతమవుతున్నప్పటికీ స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ…“అగ్రకుల పాలనను బీసీలు ఇక భరించరు. బీసీ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదు… ఇది దారుణం. బీసీలంతా ఒకటై పోరాడాల్సిన సమయం వచ్చేసింది,” అని అన్నారు.అదేవిధంగా సాయి ఈశ్వర్ కుటుంబానికి వెంటనే రూ. 50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వం కోరారు.







