

మెగా పేరెంట్స్ మీటింగ్స్ పిల్లల బంగారు భవిష్యత్తుకు దోహదపడతాయి…. ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు
Mega Parents Meetings బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ లోని కొత్త నందాయపాలెం మరియు నల్లమోతువారిపాలెం గ్రామాలలో గల నాలుగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లలో పాల్గొని పిల్లలతో ను, ఉపాధ్యాయులతో ను మరియు పేరెంట్స్ తో ను ముచ్చటించి విద్యార్ధుల భవిష్యత్తు కోసం అనేక విషయాలపై చర్చించిన ఆ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ, మెగా పేరెంట్స్ మీటింగ్స్ ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం అని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కూల్ యూనిఫామ్, బుక్స్ తో సహా అన్ని రకాల కిట్స్ ను మరియు రుచికరమైన ఆహారాన్ని కూడా మధ్యాహ్న భోజన పథకం కింద అందిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. కేవలం విద్యతోనే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, అబ్దుల్ కలాం మరియు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి సామాన్యులు భారతదేశానికి మహానుభావులు గా కీర్తింపబడుతున్నారు కనుక వారిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెంది, దేశాభివృద్ధికి తోడ్పడాలి అని పిలుపునిచ్చారు.
కొత్తనందాయపాలెం గ్రామంలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడి, తల్లితండ్రులతో చర్చించి పాఠశాల అభివృద్ధి కోసం పలు సూచనలు చేసిన ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అందించబడుతున్న ఫ్రీ స్కూల్ కిట్స్ ను ఆవిష్కరించి అంగన్వాడీ టీచర్స్ కు మరియు పిల్లలకు అందించారు.
విద్యార్ధిని విద్యార్ధులకు మంచి విద్యను అందిస్తున్న ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అభినందించారు.
కార్యక్రమంలో టీడీపీ యూనిట్ ఇంచార్జి మాడా శ్రీనివాసరావు, టీడీపీ గ్రామ పార్టీ ఇంచార్జ్ మునిపల్లి చిన్నా, జనసేన ఇంచార్జి గరిగంటి శ్రీనివాసరావు, సాయిని రాంబాబు, విద్యా కమిటీ చైర్మన్ లు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, పేరెంట్స్, అంగన్వాడీ టీచర్స్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.








