
విదేశాల్లో స్థిరపడి మాతృభూమిపై మమకారంతో ప్రజాసేవకు ముందుకొస్తున్న దాతలు సమాజానికి నిజమైన స్ఫూర్తిప్రదాతలు అని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో డా. నిర్మల వై కరణం మెమోరియల్ ఆల్ ఫ్రెస్కో యాంపీధియేటర్ ను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నసీర్ అహ్మద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి డా. నిర్మల వై కరణం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఆరోగ్య, ఆనంద, సుసంపన్నమైన రాష్ట్ర సాధనలో ప్రభుత్వంతో పాటు దాతల భాగస్వామ్యం ఉందన్నారు. సమాజ అభివృద్ధిలో దాతలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని సైతం అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి అభివృద్ధికి ఎన్నారై వైద్యులు ఎంతో సహకారం అందిస్తున్నారన్నారు. డా. నిర్మల వై కరణం 30 సంవత్సరాలుగా అమెరికాలో మహిళల కోసం పనిచేశారని తెలిపారు. ఢా. నిర్మల వై కరణం జ్ఞాపకార్థం ఆమె భర్త కరణం రాజా జిజిహెచ్ లో ఓపెన్ ఎయిర్ థియేటర్. నిర్మించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూన్నమని తెలిపారు. జి జి హెచ్ కు వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది మర్యాద గౌరవంతో పలకరిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించాలని సూచించారు. శాసనసభ్యులు నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులే మిన్న అనే సూక్తికి అనుగుణంగా గుంటూరు మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులైన ఎన్నారై వైద్యులు, ప్రభూత్వ సహకారంతో జిజీహెచ్ అభివృద్ధికి నూతన శకం ప్రారంభమైందన్నారు. ప్రభుత్వంతోపాటు దాతలు అందించిన సహకారంతో జిజిహెచ్ లో పేద ప్రజల వైద్య చికిత్సలకు అవసరమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగుతుందన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, త్వరలోనే రూ.41 కోట్లతో వెల్ఫేర్ సెంటర్ వద్ద నూతన వైద్య విభాగాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.. ఆసుపత్రి అభివృద్ధికి వైద్య సేవలు విస్తరణకు ప్రభుత్వానికి మరింతగా దాతలు సహకారం అందించాలన్నారు కార్యక్రమంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. రమణ యశస్వి, కార్పోరేటర్ సమత, జీజీహెచ్ ఈఆర్ విభాగం హెచ్ఓడీ డా. రాధిక, డా. రాజా కరణం, డా. పొదిలి ప్రసాదు, డా తాతనేని గోపాలరావు, డా. వై అశోక్ తదితరులు పాల్గొన్నారు.







