
Bapatla:చీరాల: -భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా చీరాలలో కూటమి నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమం ఘనంగా సాగింది. స్థానిక ముక్కోణం పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే కొండయ్య గారు “సమాజంలోని అణగారిన వర్గాల కోసం అంబేద్కర్ గారు చేసిన సేవలు ఎనలేనివి. దేశానికి రాజ్యాంగాన్ని అందించి సమానత్వానికి బాటలు వేసిన మహానుభావుడు” అని అన్నారు.

కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, చీరాల మున్సిపల్ ఛైర్మన్ మీంచాల సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుద్దండి చంద్రమౌళి, టిడిపి పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Is this conversation helpful so far?







