Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :ఆటోలో పోగొట్టుకున్న హ్యాండ్‌బ్యాగ్‌ను గంటల వ్యవధిలోనే గుర్తించి బాధిత ఉపాధ్యాయురాలికి తిరిగి అందజేసిన బాపట్ల పట్టణ పోలీసులు

బాపట్ల;- పట్టణానికి చెందిన ఒక ఉపాధ్యాయురాలి విలువైన హ్యాండ్‌బ్యాగ్‌ను పోలీసులు తక్షణ చర్యతో తిరిగి అందజేశారు. వివరాల్లోకి వెళితే—బాపట్ల మండలం పాండురంగాపురం గ్రామంలో ఎన్ఎస్ టీచర్‌గా పనిచేస్తున్న తూమాటి వరకుమారి గారు శుక్రవారం (5వ తేదీ) బాదంపాలు సెంటర్ వద్ద ఆటో ఎక్కి పాత కరెంట్ ఆఫీస్ వద్ద దిగారు. అనంతరం తన హ్యాండ్‌బ్యాగ్ కనిపించకపోవడంతో తక్షణమే శనివారం ఉదయం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.

హ్యాండ్‌బ్యాగ్‌లో విలువైన వస్తువులు, ఇంటి తాళాలు, అవసరమైన కార్డులు ఉండటంతో విషయం తెలుసుకున్న పట్టణ సీఐ ఆర్. రాంబాబు వెంటనే స్పందించారు. ట్రాఫిక్ ఇంచార్జ్ హెడ్ కానిస్టేబుల్ మూర్తి సహాయంతో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించి, ఉపాధ్యాయురాలు ప్రయాణించిన ఆటోను విజయవంతంగా గుర్తించారు. అనంతరం విచారణ జరిపి, పోగొట్టుకున్న హ్యాండ్‌బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని వరకుమారి గారికి తిరిగి అందజేశారు.తన విలువైన వస్తువులు సురక్షితంగా తిరిగి దొరికినందుకు ఉపాధ్యాయురాలు పోలీసుల సేవా భావాన్ని అభినందించారు.పట్టణ పోలీసులు వేగంగా పనిచేసి బాధితురాలి ఆందోళనను వెంటనే నివారించినందుకు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ సీఐ రాంబాబు మరియు స్టేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker