
గుంటూరు డిసెంబరు 8: భారత సైనికుల త్యాగాలు అపారమని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా మొదటి విరాళం అందజేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ—సైనికులు కుటుంబాలను విడిచి సియాచిన్ వంటి తీవ్రమైన పరిస్థితుల్లో దేశ సరిహద్దులను కాపాడుతూ ఉన్నారని, వారి సేవలకు ప్రతి పౌరుడు రుణపడి ఉంటాడని తెలిపారు. వీరజవానులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం అందరూ విరాళాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు.జిల్లాలో సాయుధ దళాల పతాక నిధికి ఈ ఏడాది ఇప్పటివరకు Rs.17,67,363 సేకరించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.పెద్ద మొత్తంలో విరాళాలు అందించిన సంస్థలు, వ్యక్తులుజిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ – ₹6.40 లక్షలుమెప్మా – ₹2.05 లక్షలువి.ఐ.టి యూనివర్సిటీ – ₹2.50 లక్షలుఎస్.ఆర్.ఎం యూనివర్సిటీ – ₹1.30 లక్షలుడా. పి. కళావతి – ₹1 లక్షకోస్టల్ బ్యాంక్ – ₹1 లక్షమాజీ సుబేదార్ నాగమల్లేశ్వరరావు – ₹1 లక్షధిక విరాళాలు అందించిన అధికారులను కలెక్టర్ సత్కరించారు.

వీరమరణం పొందిన జవాను కుటుంబానికి సాయం2023 అక్టోబర్ 17న ఉత్తరాఖండ్‌లో ఆపరేషన్ స్నో లెపర్డ్‌లో విధుల్లో ఉన్నప్పుడు ప్రమాదంలో మరణించిన చిట్టుమడుగుల వాసు కిషోర్ భార్య చిట్టుమడుగుల నవీనను కలెక్టర్ సత్కరించారు. వారికి ఏటుకూరు గ్రామంలో 300 గజాల హౌస్ సైట్ మంజూరు చేశారు.విరాళాల చెల్లింపు వివరాలు విడుదలజిల్లా సైనిక సంక్షేమ అధికారి ఆర్. గుణశీల ప్రకారం, విరాళాలు ఆన్‌లైన్ ద్వారా లేదా చెక్కు ద్వారా అందించవచ్చని తెలిపారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడకరెంట్ అకౌంట్ నం.: 33881128795
IFSC: SBIN0016857MICR: 520002046జిల్లా సైనిక సంక్షేమ సంఘం ప్రతినిధులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తూ, సైనిక సంక్షేమ కార్యాలయానికి దారి సమస్య పరిష్కారం, మాజీ సైనికులకు కనీసం 175 గజాల స్థల కేటాయింపు కోరారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్డీవో శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







