
మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం కేసు దర్యాప్తులో ముగ్గురు అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి సుమారు 19 గ్రాముల బంగారం, 740 గ్రాముల వెండి స్వాధీనం చేశారు.
దొంగతనం కేసు వివరాలు
04.11.2025న యర్రబాలెం గ్రామానికి చెందిన భూక్య వీరాంజనేయులు నాయక్ ఇంటిలో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో Cr.No. 490/2025 U/s 331(4), 305(a) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలు ఇంట్లో నుండి ఆరు జతల వెండి పట్టీలు, ఒక జత చెవిదిద్దులు, ఒక జత బంగారు మాటీలు మరియు రూ. 20,000 నగదు దొంగిలించారు.
దర్యాప్తులో ఈ కేసుకు ప్రధాన నిందితుడు A1 తోట శివకుమార్ @ శివభవాని అని గుర్తించారు. ఇతడు రాష్ట్రంలో 150కుపైగా హౌస్‌బ్రేకింగ్ దొంగతనాల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇతనికి A2 షేక్ ఇంతియాజ్, A3 తోట వరలక్ష్మి సహకరించినట్లు వెల్లడైంది. hyderabad: ఎకరానికి ₹177 కోట్లకు అమ్ముడై కొత్త రికార్డు:హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త రికార్డు:
A1 01.11.2025న బెయిల్‌పై జైలు నుండి బయటకు వచ్చి, A2, A3లతో కలిసి దొంగతనాలు చేసి ఖర్చులు నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. \
04.11.2025న కడప జిల్లా అక్కయ్యపల్లి నుండి విజయవాడకు వచ్చి, అక్కడి నుండి మంగళగిరి ఎర్రబాలెం ప్రాంతంలో రేకీ చేసి, రాత్రి ఒక ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు దొంగతనం చేశారు.
తదుపరి కడప, దువ్వాడ, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో కూడా దొంగతనాలకు పాల్పడ్డట్లు నిందితులు ఒప్పుకున్నారు.
అరెస్ట్ అయిన నిందితుల వివరాలు
- A1 తోట శివకుమార్ @ శివభవాని, 36 సంవత్సరాలు, ఎర్రగడ్డ కాలనీ, చినగంట్యాడ, గాజువాక, విశాఖపట్నం.
- A2 షేక్ ఇంతియాజ్, 26 సంవత్సరాలు, శాస్త్రి నగర్, అక్కయ్యపల్లి, కడప జిల్లా.
- A3 తోట వరలక్ష్మి, 31 సంవత్సరాలు, ఎర్రగడ్డ కాలనీ, చినగంట్యాడ, గాజువాక, విశాఖపట్నం.
ఇతర పోలీస్ స్టేషన్లలో వీరి మీద కేసులు
- Cr.No. 261/2025 – DK దిన్నె PS
- Cr.No. 347/2025 – దువ్వడ PS
- Cr.No. 528/2025 – గాజువాక PS
- Cr.No. 529/2025 – గాజువాక PS
- Cr.No. 234/2025 – అనకాపల్లి PS
పోలీసుల చర్య
08.12.2025 ఉదయం 11.30 గంటలకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి ఆభరణాలు స్వాధీనం చేసి రిమాండ్‌కు పంపారు.
LHMS ఉపయోగంపై సూచన
ప్రజలు ఇంటిని లాక్ చేసి బయటకు వెళ్లే సందర్భాల్లో Locked House Monitoring System (LHMS) ను ఉచితంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ LHMS ద్వారా ఇళ్ల వద్ద CC కెమెరాలు ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాలలో గస్తీ పెంచే చర్యలు చేపడతారు.
దర్యాప్తులో పాల్గొన్న అధికారులు
మంగళగిరి రూరల్ సర్కిల్ CI A.V. బ్రహ్మం, ఎస్సైలు Ch. వెంకటేశ్వర్లు, బాలు నాయక్, ASI రత్నరాజు, PC సాగర్.








