
లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో దొంగతనం కేసు ఛేదన – ఇద్దరు అరెస్టు
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చోటుచేసుకున్న దొంగతనాన్ని బాలానగర్ పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా అరెస్టయిన ఇద్దరు నిందితులను విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు. Hydrabad :గుంటూరులో సేవా సదన్ కార్యాలయంలోహైదరా కమిషనర్ కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా
అరెస్టయిన నిందితులు
- వంశీ కృష్ణ (32) – బైక్ మెకానిక్, జగద్గిరిగుట్ట నివాసి
- మట్ట భరత్ రాజీవ్ గాంధీ (23) – జగద్గిరిగుట్ట నివాసి
స్వాధీనం చేసిన వస్తువులు
పోలీసులు నిందితుల వద్ద నుండి క్రింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు:
- ₹2,27,000 నగదు
- గ్లామర్ బైక్
- శామ్సంగ్ గెలాక్సీ వాచ్
- వెండి గాజులు (బంగారు పూత) – 2 (53 గ్రాములు)
- నెక్లెస్ (గోల్డ్ గోల్డ్) – 109 గ్రాములు
- నడుము బెల్ట్ (గోల్డ్ గోల్డ్) – 69 గ్రాములు
- రెండు సెల్‌ఫోన్లు – ఆపిల్ ఐఫోన్ 16 ప్రో, వివో Y-22
- దొంగతనానికి ఉపయోగించిన రెండు ఇనుప రాడ్లు
వారిపై నమోదైన కేసులు
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం నిందితులపై:
- బాలానగర్ పి.యస్ లో 1 కేసు
- KPHB పి.యస్ లో 1 కేసు
- మియాపూర్ పి.యస్ లో 1 కేసు
- జగద్గిరిగుట్ట పి.యస్ లో 4 కేసులు
మొత్తం 7 కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.
పోలీసులు చేసిన వేగవంతమైన దర్యాప్తుతో కేసు ఛేదన సాధ్యమైందని, ప్రాంతంలో దొంగతన సంఘటనలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా చేపట్టినట్లుగా అన్నారు.








