
బాపట్ల: డిసెంబర్ 9:-బాపట్ల కలెక్టరేట్ ప్రాంగణం మంగళవారం కాసేపు కళకళలాడింది. ఫుడ్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులతో ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ సరదాగా ముచ్చటిస్తూ అక్కడ సందడి నెలకొల్పారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను ఆసక్తిగా పరిశీలించిన ఎమ్మెల్యే, వాటిని కొనుగోలు చేసి రుచి చూసి అభినందనలు తెలిపారు.
వారితో అనౌపచారికంగా మాట్లాడి వారి ప్రతిభను ప్రశంసించిన అనంతరం, విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగుతూ మరింత ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యే సందర్శనతో విద్యార్థుల్లో ఆనందం ఉరకలెత్తింది.







