
చీరాల: డిసెంబర్ 9:-సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎంటర్‌పెన్యువర్‌షిప్ డెవలప్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఎంటర్‌పెన్యువర్‌షిప్ ఎవేర్‌నెస్ కార్యక్రమం లో భాగంగా యం.బి.ఎ విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ప్రకటించారు.ఒకరోజు పాటు జరిగిన ఈ వర్క్‌షాప్‌ను ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు ప్రారంభించారు. రుడ్‌సెటి, ఒంగోలు డైరెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి ప్రధాన అతిథిగా హాజరై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే లక్ష్య నిర్దేశం, విషయ సేకరణ, సమయపాలన, సరైన దారిలో వ్యాపారాభివృద్ధి వంటి అంశాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. పరిశ్రమల నిర్వహణలో టీమ్ వర్క్ ప్రాధాన్యతను వివరించే పాటు, పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు అందించే రుణసౌకర్యాలు, రాయితీలపై వివరణాత్మకంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి డా. యస్. చాంద్ బాషా కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. సెమినార్‌లో ఎం.బి.ఎ విభాగాధిపతి డా. ఆర్. ఇమ్మానియేల్, ఇతర విభాగాధిపతులు, అధ్యాపకులు, ఎం.బి.ఎ విద్యార్థులు పాల్గొన్నారు.







