
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి “కార్యకర్తలతో ముఖాముఖి” కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు డివిజన్ల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా మహిళా గ్రీవెన్స్ కు వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అరండల్ పేట, నగరంపాలెం సీఐలకు సూచిస్తూ, గ్రీవెన్స్ కు వచ్చిన సంబంధిత అర్జీలను వారికి అందజేశారు. City News Telugu
ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బృందావన్ గార్డెన్స్, గెలాక్సీ బార్ రోడ్లలో విస్తరణ పనులు చేపడుతునప్పుడు ప్రజల ఆస్తులకు ఎక్కువ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, 43వ వార్డు మెయిన్ డ్రైన్ విస్తరణ, వేళాంగిణీ నగర్ 1వ లైన్ లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని, అలాగే 36వ డివిజన్ లోని చాకలికుంటను ఆక్రమణల నుంచి రక్షించేందుకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని సిటీ ప్లానర్ రాంబాబును ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు.







