
అమరావతి: డిసెంబర్ 11:-వెలగపూడి సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మరియు మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి ను ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. మోహన్ కుమార్ ధర్మ, గిరిజన నాయకులు మళ్లీ భాస్కరరావు కలిసి పలు సమస్యలు వివరించారు.ఈ సందర్భంగా వారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న విడుదల శ్రీదేవి విషయాన్ని మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఓసి/కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమె, తాను ఎస్టి సుగాలిగా తప్పుడు జాతి సర్టిఫికేట్ సమర్పించి ఉద్యోగం చేస్తున్నట్లు ఆరోపించారు. ఆమెతో పాటు ఆమె అక్క, చెల్లెళ్లు కూడా ఇలాగే ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. అలాగే శ్రీదేవి కుమార్తె కర్నూలులో ఎంబీబీఎస్ చదువుతున్నదీ, అది కూడా ఎస్టి కోటాలోనేనని వారు వెల్లడించారు.
ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు కోరారు. అదేవిధంగా ఇతర గిరిజన సమస్యలను కూడా మంత్రివర్యులకు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి సంధ్యారాణి, తక్షణమే పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.







