
గుడివాడ: డిసెంబర్ 12: – జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 15న గుడివాడ ముగ్గు బజార్ సెంటర్‌లోని రెడ్ సన్ ఫౌండేషన్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీ యం. నవీన్ తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.వెనిగండ్ల ఫౌండేషన్, రెడ్ సన్ ఫౌండేషన్, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ మేళాలో హెట్రో, లూకాస్ టీవీఎస్, వరుణ్ మోటార్స్, వన్ మోర్ గోల్ ప్రైవేట్ లిమిటెడ్, జోయలుక్కాస్ జ్యువెలరీ, NS ఇన్‌స్ట్రుమెంట్స్, ఇన్నోవ్ సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు 25కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయని అధికారులు తెలిపారు.

10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీ.ఫార్మసీ పూర్తిచేసిన 18–35 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన వారికి వేతనం సహా ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ దేవరపల్లి విక్టర్ బాబు, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డా. పి. నరేష్ కుమార్, యంగ్ ప్రొఫెషనల్ వై. జయరాజు, జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సుమలత, రెడ్ సన్ ఫౌండేషన్ ఫౌండర్ సి. సురేష్ బాబు వివరించారు.జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలని సూచించారు.రిజిస్ట్రేషన్ లింక్:https://docs.google.com/forms/d/e/1FAIpQLSfl6yzLFDVMQrYNv0ROKgbzOn-NV5_cBCvZJa-HLc10jSkOtA/viewform?usp=headerమేళాకు హాజరయ్యేటప్పుడు రెజ్యూమే, ఆధార్, ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్, PAN, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలని అధికారులు సూచించారు.వివరాలకు సంప్రదించండి: 9666115251, 9000111921







