
చీరాల:డిసెంబర్ 12:-చీరాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య యాదవ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ మేళా భారీగా ఉపయుక్తమవుతోంది.మేళాలో మొత్తం 17 కంపెనీలు పాల్గొని, వివిధ విభాగాల్లో నియామకాలకు అవకాశాలు అందించాయి.
Chirala Local News ఉదయం తొలి గంటల నుంచే యువతి–యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొత్తం 700 మందికి పైగా అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ, “యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది. ఈ జాబ్ మేళా ద్వారా మరెందరోకు ఉపాధి లభిస్తుందని విశ్వసిస్తున్నాము” అన్నారు. గతంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,037 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించబడినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రషీద్, AMC చైర్మన్ కౌతరపు జనార్ధన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గుదంటి చంద్రమౌళి, చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ సుబ్బయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.







