
చీరాల: డిసెంబర్ 12- 2025:-ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగింది.Chirala Local News ఈ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు హాజరై ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించారు.ప్రజా దర్బార్‌లో మొత్తం 177 అర్జీలు స్వీకరించబడినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వీటిలోఇంటి నిర్మాణాలు & ఇంటి స్థలాలకు సంబంధించినవి – 140,పింఛన్లకు సంబంధించినవి – 27,ఇతర పలు సమస్యలపై – 10 అర్జీలు వచ్చాయని తెలిపారు.ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కొండయ్య హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో AMC చైర్మన్ కౌతువరపు జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ సుబ్బయ్య, BJP నాయకులు మువ్వల వెంకట రమణారావు, చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, పట్టణ అధ్యక్షులు దోగుపర్తి వెంకట సురేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, గూడూరు శివరాం ప్రసాద్, ఉసిరిపాటి సురేష్, బాలకృష్ణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.ప్రజల అర్జీలను పరిష్కరించడంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించినట్లు స్థానికులు అభిప్రాయపడ్డారు.







