
బాపట్ల:డిసెంబర్ 13:-బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో ఉన్న బధిరుల ఆశ్రమ పాఠశాలకు గౌరవ బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు విశాల హృదయంతో సేవా చేయూత అందించారు. సుమారు రూ.6 లక్షల రూపాయల విలువగల 90 మంచాలను ఆశ్రమ విద్యార్థులకు ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు గారు మాట్లాడుతూ, వికలాంగులు, ముఖ్యంగా బధిర విద్యార్థుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. Bapatla Local Newsవిద్యతో పాటు వసతుల మెరుగుదల ద్వారానే వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందన్నారు. ఆశ్రమంలో నివసిస్తున్న విద్యార్థులు సౌకర్యవంతమైన వసతులు పొందాలన్న ఉద్దేశంతో ఈ మంచాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు బధిరుల ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు గారి సేవా దృక్పథం పలువురికి ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు ప్రశంసలు కురిపించారు.







