
చీరాల: డిసెంబర్ 13 :-సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FDP) ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ (IQAC) ఆధ్వర్యంలో చేపట్టినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ యస్. లక్ష్మణరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్ వరంగల్‌కు చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ విభాగ ప్రొఫెసర్ డా॥ ఎ. వేణుగోపాల్ హాజరై, అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ (OBE) మరియు కో–పో అటైన్‌మెంట్ ప్రాసెస్ అంశాలపై అధ్యాపకులకు సమగ్ర అవగాహన కల్పించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె. జగదీష్ బాబు మాట్లాడుతూ, అవుట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ విధానంలో బోధన సాగితే విద్యార్థుల నైపుణ్యాలు మరింతగా మెరుగుపడతాయని తెలిపారు.Bapatla Local News కో–పో అటైన్‌మెంట్‌ను ఎలా అమలు చేయాలో డా॥ వేణుగోపాల్ సవివరంగా వివరించారని చెప్పారు.ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా అధ్యాపకులు విద్యార్థి కేంద్రిత బోధన పద్ధతులు, నేర్పు ఫలితాలను మెరుగుపరిచే మెళుకువలను నేర్చుకునే అవకాశం లభించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.







