
hyderabad :Vaibhava Venkateswara Swamy Temple, Miyapur – Dhanurmasam CelebrationsMiyapur Local News :వైభవ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ప్రశాంత్ నగర్, మియాపూర్ నందు ధనుర్మాస ఉత్సవాలుప్రశాంత్ నగర్ మియాపూర్‌లో ధనుర్మాస ఉత్సవాలు :మియాపూర్:శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ప్రశాంత్ నగర్, మియాపూర్ నందు ధనుర్మాస ఉత్సవాలు డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 14, 2026 వరకు అత్యంత విశేషంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ధనుర్మాస సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు స్వామివారికి విశేష అర్చన, తిరుప్పావై సేవాకాలం ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం ప్రాకారోత్సవం, తీర్థప్రసాద గోష్ఠి జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శన భాగ్యం పొందవచ్చని పేర్కొన్నారు.Hyderabad Local news:CM రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా
అదేవిధంగా డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేష పుష్పాలంకరణతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.
ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 14వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ గోదా రంగనాధుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామానుజాచార్యులు మాట్లాడుతూ, ధనుర్మాసం శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైన మాసమని తెలిపారు. ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం జరిగే తిరుప్పావై సేవాకాలం, విశేష అర్చనల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు ఆయురారోగ్యాలు, కుటుంబ శాంతి, సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేయడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తంగా పేర్కొన్నారు.
అలాగే ధనుర్మాసం చివరి రోజున జరిగే శ్రీ గోదా రంగనాధుల కళ్యాణోత్సవంను దర్శించుకుంటే దాంపత్య సౌఖ్యం, సంతాన భాగ్యం, ఆర్థిక అభివృద్ధి లభిస్తాయని అర్చకులు వివరించారు. ఈ ఆలయంలో నిర్వహించే ధనుర్మాస ఉత్సవాలు శాస్త్ర సంప్రదాయబద్ధంగా, అత్యంత నియమ నిష్ఠలతో జరుగుతాయని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని వారు కోరారు.







