
గుంటూరు:-రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్యతరగతి పత్రికలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాటి హక్కులు, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ‘స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (సామ్నా)’ ప్రధాన లక్ష్యమని సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డి స్పష్టం చేశారు.శనివారం గుంటూరులో నిర్వహించిన సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎంపిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2018లో ఏపీయూడబ్ల్యూజే అనుబంధంగా సామ్నా ఏర్పడిందని, చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి దివంగత అంబటి ఆంజనేయులు ఈ సంఘాన్ని స్థాపించారని ఆయన గుర్తు చేశారు.సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు కృషితో సంఘం స్థిరపడిందని, అలాగే ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి. సుబ్బారావు సంకల్పం, మార్గదర్శకత్వంతో సామ్నా మరింత పటిష్టంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఐ.వి. సుబ్బారావు నాయకత్వంలో అన్ని కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేసి సామ్నాను బలోపేతం చేశారని పేర్కొన్నారు.ఈ క్రమంలో భాగంగానే సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సమావేశాన్ని ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్.ఎన్. మీరా, జిల్లా కార్యదర్శి కే. రాంబాబు ప్రత్యేక చొరవతో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా కార్యదర్శి కే. రాంబాబు మాట్లాడుతూ, రాష్ట్ర బాధ్యుల ఆదేశాల మేరకు సామ్నా గుంటూరు జిల్లా కమిటీ నిర్మాణం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డి సామ్నా లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ, చిన్న పత్రికల అభివృద్ధికి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు.

గుంటూరు జిల్లా నూతన కమిటీ ప్రకటనసమావేశం అనంతరం సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీని అధికారికంగా ప్రకటించారు.జిల్లా అధ్యక్షులు: వెన్నపూస దశరథరామిరెడ్డి (మాట కోసం)జిల్లా కార్యదర్శి: సిహెచ్. శ్రీనివాసరావుఉపాధ్యక్షులు: మౌలాలి (ప్రతి నిమిషం)సంయుక్త కార్యదర్శి: వహీద్ భాషా (బలగం న్యూస్)కోశాధికారి: ఎల్. వెంకటేశ్వరరావు (తెనాలి టైమ్స్)

ఈసీ సభ్యులుగా:ఎం. శ్రీనివాసరావు (ప్రోగ్రెస్ న్యూస్)పి. దేవానంద్ మొనగాడు (పక్షపత్రిక)బాలాజీ సింగ్ (మన కళాశాల వారపత్రిక)నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులు సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. రమణారెడ్డిని, అలాగే ప్రజాభీష్టం దినపత్రిక ఎడిటర్ ఎం.వి. సుబ్బారావును శాలువాలతో ఘనంగా సన్మానించారు.Guntur Local Newsఈ సమావేశంలో గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన చిన్న పత్రికల సంపాదకులు, పబ్లిషర్లు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కమిటీకి జర్నలిస్టులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐజేయు మాజీ నాయకులు మార్కండేయులు, ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు ఎస్.ఎన్. మీరా, జిల్లా కార్యదర్శి కే. రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు పరశ్యం నాయక్, గుంటూరు నగర కమిటీ అధ్యక్ష–కార్యదర్శులు వెంకయ్య, కార్తీక్, కమిటీ సభ్యులు రఘునాథరెడ్డి, వివిధ పత్రికల ఎడిటర్లు, పబ్లిషర్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు.







