
కృష్ణాజిల్లా: గుడివాడ:14-12-25:-ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ జె.ఆర్.కె. హనిష్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించి, బ్రీత్ ఎనలైజర్ ద్వారా వాహనదారులను పరీక్షించారు.

ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC బుక్), ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్ వంటి పత్రాలు కలిగి ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ ధరించడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.Gudivada news ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, వాహనదారులు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.







