
Hyderabad:కుత్బుల్లాపూర్:ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని, ఎవ్వరూ అధైర్యపడవద్దని ఆయన సూచించారు. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతామని స్పష్టం చేశారు.ఈశ్వరాచారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జగద్గిరిగుట్టలోని ఈశ్వరాచారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, టీపీసీసీ ‘సంవిధాన్ బచావో’ కమిటీ చైర్మన్ డా. వినయ్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, నూతి శ్రీకాంత్, మెట్టు సాయి, బీసీ సంఘం నాయకులు గణేష్ చారి తదితరులు పాల్గొన్నారు.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈశ్వరాచారి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.Hyderabad Local News బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఈ కుటుంబానికి ఆర్థిక సాయం మాత్రమే కాకుండా కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు కూడా అందిస్తామని ప్రకటించారు.బీసీ సమాజం హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు.







