
ఏలూరు జిల్లా:- చింతలపూడి నియోజకవర్గంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలు శాంతియుతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
శనివారం చింతలపూడి బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ పరీక్ష కేంద్రాన్ని డీఈఓ వెంకట లక్ష్మమ్మ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

అనంతరం ఆమె సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అక్కడ నివసిస్తున్న పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.Elure Local News:చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా – పెండింగ్ జీతాలు, పీఎఫ్ విడుదల చేయాలని డిమాండ్
ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు మొత్తం 174 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు డివిజన్ డిప్యూటీ డీఈఓ డాక్టర్ పి.కె. సుధాకర్, చింతలపూడి మండల విద్యాశాఖ అధికారి రెండు కిరణ్ కుమార్‌తో పాటు ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.







