
తాడికొండ:చలపతి విద్యాసంస్థలు క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాయని కేంద్ర రూరల్ డెవలప్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి వర్యులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తాడికొండ మండలం మోతడక గ్రామంలోని చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన చలపతి హిల్ వ్యూ స్టేడియంను ఆదివారం సాయంత్రం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మోతడక“భవిష్యత్తు స్మార్ట్ సిటీస్ & ఇంటెలిజెంట్ మొబిలిటీ” సెమినార్ ఘనంగా ప్రారంభం

ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, చలపతి కళాశాలల చైర్మన్ వై.వి. ఆంజనేయులులతో కలిసి స్టేడియాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. దిల్ రాజు బ్యాటుకమ్మ యువ చిత్ర నిర్మాణ ఛాలెంజ్ ప్రారంభం|| Dil Raju Announces Batukamma Young Filmmakers Challenge

క్రీడలలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం, ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయని తెలిపారు. ఇటీవల ప్రపంచ మహిళా క్రికెట్, అంధుల క్రికెట్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు ప్రోత్సాహకాలు అందజేశారని గుర్తు చేశారు.

అలాగే విద్యాసంస్థల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ సీట్లు కేటాయిస్తున్నారని, ఈ అవకాశాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చలపతి కళాశాల కార్యదర్శి వై. సుజిత్ కుమార్, డైరెక్టర్ వినయ్ కుమార్, ఖాదీ విలేజ్ బోర్డు రాష్ట్ర డైరెక్టర్ సాంబశివరావు, కళాశాల ప్రిన్సిపాల్ డా. నాగ శ్రీనివాసరావు, అడ్మిషన్స్ డీన్ డా. కె. కిరణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.








