
పెడన : డిసెంబర్ 15:-పెడన మండలంలో గ్రామపంచాయతీలకు కార్యదర్శుల నియామకాలు, పదోన్నతులు చోటుచేసుకున్నాయి. కమలాపురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గంధం ఉమామహేశ్వరి పీఎస్ గ్రేడ్–2 నుంచి పీఎస్ గ్రేడ్–1గా పదోన్నతి పొందారు. అనంతరం ఆమెను కృత్తివెన్ను గ్రామపంచాయతీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఆమె రిలీవ్ అయ్యారు.అలాగే మడక గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వార్త అనురాధ పీఎస్ గ్రేడ్–3 నుంచి పీఎస్ గ్రేడ్–2గా పదోన్నతి పొందారు. పదోన్నతుల అనంతరం ఆమెను బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామపంచాయతీకి నియమించారు.
కమలాపురం గ్రామపంచాయతీకి ఇంచార్జి కార్యదర్శిగా రాజేష్ గురివిందగుంటను నియమించారు. సంక్రాంతి “సంబరాల్లో “MP,వల్లభనేని బాలశౌరిమడక గ్రామపంచాయతీకి ఇంచార్జి కార్యదర్శిగా యుగంధర్‌ను నియమించగా, చోడవరం గ్రామపంచాయతీకి నందిగామకు చెందిన షణ్ముఖరావు, ఎస్.వి.పల్లి గ్రామపంచాయతీకి నియమితులయ్యారు.ఈ నియామకాలు, పదోన్నతులతో సంబంధిత గ్రామపంచాయతీల్లో పరిపాలనా వ్యవహారాలు మరింత సమర్థవంతంగా సాగనున్నాయని అధికారులు తెలిపారు.







