
బాపట్ల:15-12-25:-బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెం నేషనల్ హైవే నుంచి పాండురంగాపురం వరకు రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.11 కోట్ల నిధులు మంజూరు కావడం అభినందనీయమని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు.బాపట్ల మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నకు బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు స్పందిస్తూ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారి ద్వారా రోడ్డు విస్తరణకు అవసరమైన నిధులు విడుదల చేయించామని తెలిపారు. ఈ విషయాన్ని తాండ్ర సాంబశివరావు మీడియాకు తెలియజేశారు.

ఈ సందర్భంగా తాండ్ర మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా మరుప్రోలువారిపాలెం నుంచి పాండురంగాపురం వరకు రోడ్డు విస్తరణ కోసం స్థానికులతో పాటు సముద్రతీర గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు.Bapatla Local News విస్తరణ చేపట్టకపోవడం వల్ల ప్రమాదాలు అధికంగా జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఈ రోడ్డు విస్తరణను సాధ్యం చేసిన బాపట్ల శాసన సభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి కృషిని తాండ్ర ప్రశంసించారు. బాపట్ల అభివృద్ధికి కీలకమైన ఈ రోడ్డు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు.







