
బాపట:15-12-25:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన కళ్యాణం శివ శ్రీనివాసరావు (కేకే) గారి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ గారు హాజరై, చైర్మన్ కేకే గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పిట్లవానిపాలెం మండల అధ్యక్షులు హుస్సేన్ బేగ్ (దాదా), ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యురాలు మరియు బాపట్ల ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యురాలు జిడుగు విజయ మాధురి, యాజలి కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ ఇక్కుర్తి చక్రపాణి పాల్గొన్నారు.Bapatla Local News అలాగే చిల్ల సత్యనారాయణ మాస్టర్, అరుమళ్ళ సుజిత్, కామిశెట్టి సాయి, చల్లపల్లి యేసోబు, తాండ్ర శ్రీరామ్, సిగిరిశెట్టి సంజయ్ నాయుడు తదితరులు మరియు పెద్ద సంఖ్యలో జనసైనికులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అభివృద్ధికి కేకే గారి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమం సత్సంగతులతో, ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.







