
బాపట్ల :వేమూరు:-వేమూరు మండలం పోతుమర్రు గ్రామంలో తెలుగు బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టార్ ఫెస్టివల్ అండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముందుగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్‌ను ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా వెలిగించారు. అనంతరం నిర్వహించిన సెమీ క్రిస్మస్ ప్రార్థన కూడికలో పాస్టర్ దావులూరి జయకుమార్ అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ, ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆదర్శప్రాయమైనవని, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలు క్రిస్మస్ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారని తెలిపారు.Vemuru Local News ఏసుక్రీస్తు చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ గొట్టిపాటి పూర్ణ కుమారి, మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, గ్రేస్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కైతేపల్లి షాలెం రాజు, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే టీడీపీ నాయకులు గోసే రవి, కూచిపూడి రవికాంత్, ఈపూరు రమేష్, కూచిపూడి ప్రసాద్, దోప్పలపూడి సుధాకర్, వేల్పుల రవిప్రసాద్, కేసాని శివకృష్ణ తదితరులు హాజరై వేడుకలకు శోభనిచ్చారు.







