
పర్చూరు : డిసెంబర్ 15-పర్చూరు నియోజకవర్గంలో ప్రజల హృదయాల్లో నిలిచిన “పల్లె పల్లెకు తెలుగుదేశం” కార్యక్రమం ప్రారంభించి నేటికి 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పర్చూరు బొమ్మల సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు.
ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తిని స్మరించుకుంటూ పార్టీ నేతలు కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా అడుగులు వేసిన ఈ పాదయాత్ర పర్చూరు రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ శంషుద్దీన్ మాట్లాడుతూ, అభివృద్ధే ధ్యేయంగా, ప్రజలతో మమేకమై సాగిన ఈ పాదయాత్ర ఎమ్మెల్యే ఏలూరి నాయకత్వానికి బలమైన పునాదిగా నిలిచిందన్నారు.Bapatla Local News పర్చూరు నియోజకవర్గంలో ఆయన హ్యాట్రిక్ విజేతగా చరిత్ర సృష్టించడంలో ఈ ఉద్యమానికి ముఖ్య పాత్ర ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కోడూరి శేష బ్రాహ్మచారి, టౌన్ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీను, కొల్లా బుల్లి బాబు, అబ్రహం, గద్దె చిన్న, కొండగంటి శివ, టి.శ్రీను, సాంబయ్య, కటారి సురేంద్ర, కటారి దుర్గా, సుమన్, శ్రీధర్, సురేష్, మల్లా శ్రీను, చంటి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







