ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాలు మరియు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సూచనల మేరకు బాపట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బాపట్ల పట్టణం 23వ వార్డు వివేకానంద కాలనీ మునిసిపల్ పార్కులో హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహించారు.BapatlaNews:vari sekaranaku వరి సేకరణకు మిల్లులు, రైతు సేవా కేంద్రాలు సిద్ధం చేయాలంటూ కలెక్టర్ వినోద్ కుమార్ సూచన
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు ఆరోగ్యం, వినోదం, సాంస్కృతిక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుందని, ముఖ్యంగా విద్యార్థుల్లోని కళా ప్రతిభను వెలికి తీసేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులు కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పార్కులో హాజరైన ప్రజలు విద్యార్థుల ప్రతిభను చప్పట్లతో అభినందించారు.
కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్.ఎస్.ఆర్. కృష్ణా రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ జబ్బర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ నజీర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.