
మానసిక సంక్షోభంలో ఉన్నవారిని ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ప్రమాదాలు నివారణ: డా. కోమల్ నాధ్
విజయవాడ, డిసెంబర్ 15:నదిలో దూకేందుకు ప్రయత్నించిన తల్లి మరియు ఆమె ఇద్దరు పిల్లలను ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తతతో రక్షించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.n Dr.NTR University
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భవానిపురం ప్రాంతానికి చెందిన ఒక మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి వంతెనపై నుంచి నదిలో దూకేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమై మహిళను, పిల్లలను అడ్డుకొని సురక్షితంగా రక్షించారు. అనంతరం 5వ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాల మురళి మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన అనంతరం ఆ మహిళను మరియు పిల్లలను భవానిపురం పోలీస్ స్టేషన్ సిబ్బందికి అప్పగించారు. ట్రాఫిక్ పోలీసుల తక్షణ స్పందనతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. VIJAYAWADA :విజయవాడలో జరగనున్న IJU 11వ ప్లీనరీ – బ్రోచర్ ఆవిష్కరణ
Dr. K. Komal Nadh, MBBS
Postgraduate Trainee (MD Psychiatry)
Institute of Mental Health, Erragadda, Hyderabad

నదిలో దూకేందుకు ప్రయత్నించిన తల్లి మరియు ఆమె పిల్లలను ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు రక్షించిన ఘటన మానసిక ఆరోగ్య పరిస్థితి పై చర్చించుకోవాలి
ఇలాంటి వి తరుచు మనం చూస్తూవుంటాము ముందు సమస్య ను కుటుంబ సభ్యలు గమనించి డాక్టర్ ను సంప్రదించాలి . ఈ ఘటనను నేరంగా కాకుండా, మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా చూడాల్సిన అవసరం ఉందని మానసిక వైద్య రంగానికి చెందిన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (ఎర్రగడ్డ), హైదరాబాద్లో సైకియాట్రీ విభాగంలో శిక్షణ పొందుతున్న డా. కోమలనాథ్ మాట్లాడుతూ, తల్లి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించే ఘటనల వెనుక తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు పనిచేస్తాయని తెలిపారు. ఇవి సాధారణ భావోద్వేగాల వల్ల కాకుండా, చికిత్స అవసరమైన మానసిక సంక్షోభాల కారణంగా చోటుచేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. Awareness session at Aster Ramesh Hospital on the occasion of World Prematurity Day: వరల్డ్ ప్రీమేచ్యూరిటీ డే సందర్భంగా అస్టర్ రమేష్ హాస్పిటల్లో అవగాహన సభ
డాక్టర్ వివరించిన ప్రకారం, తీవ్రమైన డిప్రెషన్, అక్యూట్ స్ట్రెస్ డిజార్డర్, ప్రసవానంతర మానసిక సమస్యలు, అలాగే కొన్ని సైకోటిక్ డిజార్డర్లు ఇలాంటి ఆలోచనలకు దారితీయవచ్చు. ఈ పరిస్థితుల్లో ఉన్న తల్లులు వాస్తవాన్ని వక్రీకరించిన ఆలోచనలతో “నేను లేకుండా పిల్లలు బతకలేరు” అనే భావనకు లోనవుతారని, ఇది మానసిక వ్యాధి వల్ల ఏర్పడే ఆలోచనా లోపంగా వైద్యులు గుర్తిస్తారని తెలిపారు. భారీ వర్షాలకు హెచ్చరికలు: ఈశాన్య, తూర్పు భారతదేశం అప్రమత్తం||Heavy Rainfall Alerts: Eastern and Northeastern India on High Alert
ఇలాంటి ఘటనలు జరగకముందే కొన్ని హెచ్చరిక లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయని డా. కోమలనాథ్ తెలిపారు. మరణం లేదా ఆత్మహత్య గురించి పదే పదే మాట్లాడటం, పిల్లల భవిష్యత్తుపై అతిగా భయపడటం, నిద్ర మరియు ఆకలి తగ్గిపోవడం, ఒక్కసారిగా సమాజం నుంచి దూరంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.
ఇలాంటి సందర్భాల్లో బాధితులను తిట్టడం లేదా నిందించడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుందని, బదులుగా తక్షణ సైకియాట్రిక్ అంచనా, అవసరమైన చికిత్స, కౌన్సెలింగ్ మరియు కుటుంబ మద్దతు అందించాల్సిన అవసరం ఉందన్నారు. సమయానికి వైద్య సహాయం అందితే ఇలాంటి మానసిక సంక్షోభాల నుంచి పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు. Jobs
సమాజానికి ముఖ్యమైన సందేశంగా, ఆత్మహత్య ఆలోచనలు బలహీనతకు సంకేతం కాదని, అవి చికిత్స చేయాల్సిన మానసిక ఆరోగ్య సమస్యలని డా. కోమలనాథ్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను మానవత్వంతో, అవగాహనతో ఎదుర్కొంటే అనేక ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. NEET PG ఏపీ PG మెడికల్ CQ 2025–26 అడ్మిషన్లకు రిపోర్టింగ్ గడువు పొడిగింపు
డా. కోమలనాథ్ తెలిపిన ప్రకారం, ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులను కుటుంబ సభ్యులు సాధారణంగా వారు పనిచేస్తున్న లేదా సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకువస్తుంటారు. అక్కడ వైద్యులు బాధితుల లక్షణాలను పరిశీలించి, పరిస్థితి తీవ్రతను బట్టి చికిత్స ప్రారంభిస్తారని చెప్పారు. అవసరమైతే మందులు లేదా కౌన్సెలింగ్ ద్వారా వారి భావోద్వేగ స్థితిని నియంత్రిస్తారని, చికిత్స కొనసాగితే పానిక్, ఆత్మహత్య ఆలోచనలు వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయని వివరించారు. సమయానికి ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య సహాయం అందించడం వల్ల ఇలాంటి ఘటనలను నివారించవచ్చని డా. కోమలనాథ్ స్పష్టం చేశారు. Doctor: పుట్టిన బిడ్డల ఆరోగ్యం & సంరక్షణ — తల్లిదండ్రులకు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి మార్గదర్శకం: Newborn Care Explained by Specialist –K.RAMBABU Journlist Exclusive Health Talk” -Dr. Mahesh Choudary Athota Consultant,Paediatric & Neonatology,MBBS, MD, Fellowship in Neonatology :








