chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో పల్స్ పోలియోపై జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం

బాపట్ల: డిసెంబర్ 16:-సెంబర్ 21న నిర్వహించనున్న NID–2025 పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు.

జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కోసం 1111 బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 67 మొబైల్ టీమ్‌లు, 113 రూట్ సూపర్వైజర్లు, 4662 మంది వ్యాక్సినేటర్లు, 42 ట్రాన్సిట్ బూత్‌లు విధుల్లో ఉంటాయని చెప్పారు. 164 హై రిస్క్, మైగ్రేటెడ్ ప్రాంతాలను గుర్తించామని, అక్కడ 2556 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందని తెలిపారు.

బాపట్ల, రేపల్లె, వేమూరు, అద్దంకి, చీరాల, పర్చూరు నియోజకవర్గాలకు ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను నియమించారు. మూడు రోజుల పాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

మునిసిపల్ కమిషనర్లు తమ సిబ్బందితో పూర్తిస్థాయిలో సహకరించాలని, పోలీస్ శాఖ మైక్ ప్రచారానికి అనుమతులు ఇవ్వాలని సూచించారు. విద్యుత్ శాఖ 24వ తేదీ వరకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని ఆదేశించారు. పంచాయతీ సెక్రటరీలు, స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, విద్యాశాఖ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు పోలియో ప్రచారంలో పాల్గొనాలని చెప్పారు.

రైల్వే, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ట్రాన్సిట్ బూత్‌ల ఏర్పాటుకు సహకరించాలని, స్వచ్ఛంద సంస్థలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మీడియా విస్తృత ప్రచారం కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.Bapatla Local News

ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మరియు వివిధ ఆరోగ్య కార్యక్రమాల బాధ్యులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker